సెన్సార్ కు సిద్ధమవుతున్న రేస్ గుర్రం

సెన్సార్ కు సిద్ధమవుతున్న రేస్ గుర్రం

Published on Apr 2, 2014 10:15 PM IST

race-gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం ఈ నెల 11న భారీ రీతిలో మనముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. ఒకటి రెండు రోజులలో ఫైనల్ కాపీతో ఈ చిత్ర బృందం సెన్సార్ ను కలవనుంది అని సమాచారం. కాబట్టి మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ వస్తుందో తెలియనుంది

ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించే కామెడీ నే కాక పుష్కలమైన రొమాన్స్ కూడా వుంటుందని దర్శకుడు తెలిపాడు. శృతిహాసన్ హీరోయిన్, సలోని రెండో నాయిక. సురేందర్ రెడ్డి దర్శకుడు. థమన్ సంగీతాన్ని అందించాడు. నల్లమలపు బుజ్జి నిర్మాత

తాజా వార్తలు