పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్లాన్స్ కి సంబందించిన తాజా వార్తని మేము విన్నాం. ఆంధ్రప్రదేశ్ లో కొత్త యువ రక్తంతో రాజకీయాల్లోకి ఆయన రావాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ కొత్త పార్టీ కాకుండా అది రాజకీయ పార్టీలకు అర్థం చెప్పే విదంగా ఉండాలనిచూస్తున్నారు. అంతేకాకుండా అది పార్టీగా కాకుండా ప్రజల చేతుల్లో పవర్ గా మారాలని ఆయన బావిస్తున్నారు. దానికోసం పవన్ కళ్యాణ్ 20, 30 మంది తెలివైన, మంచి వ్యక్తులను ఎంపిక చేయలనుకుంటున్నట్టు సమాచారం. వారు ప్రజల కోసం ఏదైనా చేసేలా అనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసే పనులన్ని చేసేలా ఉండాలని, అవసరమైతే వారు అసెంబ్లీ, పార్లమెంట్ లో కూర్చునే విదంగా వుండాలని బావిస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఎలా రన్ అవుతున్నాయని, వాటి ఆదర్శాలు ఏమిటనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఆరాతీస్తున్నారు. ఆయన ఎంచుకున్న 20 లేదా 30 మంది తో ప్రజలకు తను చేసిన వాగ్దానాలు నెరవేర్చి వారికి న్యాయం జరిగేలా చూడాలనుకుంటున్నాడు.
ఈ విషయాలకు సంబందించిన మరిన్ని విషయాలను ఎప్పటికప్పుడు 123తెలుగు ద్వారా తెలియజేస్తూఉంటాం.