విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంచు ఫ్యామిలీ హీరోలైన డా. మోహన్ బాబు, మంచు విష్ణు లతో ‘రౌడీ’ అనే సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని శనివారం ఉదయం లాంచ్ చేయనున్నారు.
ఇది కాకుండా రామ్ గోపాల్ వర్మ మంచు విష్ణుతో మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడని సమాచారం. థ్రిల్లర్ జోనర్ లో ఉండబోయే ఈ సినిమాలో మంచు పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశం ఉంది.’టెన్షన్ టెన్షన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ‘రౌడీ’ రిలీజ్ తర్వాత ఈ కొత్త మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మిగిలిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.