భారీ తమిళ సినిమాలో త్రిష

భారీ తమిళ సినిమాలో త్రిష

Published on Mar 6, 2014 10:45 PM IST

Trisha

ఒక భారీ సినిమాతో తమిళ రంగంలోకి అడుగుపెట్టనుంది త్రిష. ఎంద్రేంద్రమ్ పున్నాగై సినిమాలో జీవా సరసనచివరిసారిగా నటించింది త్రిష. ప్రస్తుతం దూకుడు కన్నడ రీమేక్ లో పునీత్ రాజ్ కుమార్ సరసన నటిస్తుంది

తాజా సమాచారం ప్రకారం ఈ చిన్నది సెల్వరాఘవన్ దర్శకత్వంలో రానున్న సినిమాలో శింబు సరసన నటించనుంది. గతంలో శింబు, త్రిష లు గౌతమ్ మీనన్ తీసిన ఏం మాయ చేసావే తమిళ వర్షన్ లో నటించారు. వీరి నటనకు విమర్శకుల ప్రశంసలు పొందారు. అందుకే మరోసారి ఈ ద్వయం నటించడానికి సిద్ధపడ్డారని సమాచారం

సెల్వ సినిమాలకు సంగీతం అందించే యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు పనిచేయనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే వివరిస్తారు. త్రిష ఎం.ఎస్ రాజు ‘రమ్’ సినిమాలో నటిస్తుంది

తాజా వార్తలు