ఎర్త్ అవర్ ప్రాతిపాధ్యానికి రామ్ చరణ్ తనవంతు సాయం చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ లో భాగమైన ఈ వేడుకలో ప్రకృతి అందించే శక్తులను సరిగ్గా వాడుకోవడంపై అవగాహన కల్పించనున్నారు. గతంలో ఈ ఈవెంట్ లో రానా పాల్గున్నాడు
ఇందులోభాగంగా ఈనెల 29న రాత్రి 8.30 నుండి 9.30 వరకూ లైట్ లను ఆర్పమని తన ఫేస్ బుక్ పేజ్ లో కోరాడు. ఈ మేరకు మార్చ్ 29న ఒక రేస్ ని కూడా నిర్వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్ కోసం కన్యాకుమారిలో బిజీగా వున్నాడు. కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ, రాజ్ కిరణ్ ముఖ్యపాత్రధారులు. బండ్ల గణేష్ నిర్మాత