పలు చిత్రాల ద్వారా తెలుగు వారికి పరిచయం ఉన్న అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్ జంటగా నటించిన సినిమా ‘అడవి కాచిన వెన్నెల’. ఇప్పరికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న రిలీజ్ చేసి త్వరలోనే సినిమాని కూడా విడుదల చేయనున్నారు. విశ్వనాధరెడ్డి దర్శక నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ చేసారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ‘ మొదట ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ టైటిల్ ఏందీ ఇలా ఉంది, సినిమా ఎలా వస్తుందో అని కానీ మూవీ అవుట్ పుట్ చూసాక హలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ నన్ను చాలా బాగా చూపించాడు. తెలుగు సినిమాకి ఇదొక సరికొత్త జోనర్ సినిమా అవుతుందని’ అన్నాడు.
హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ మాట్లాడుతూ ‘ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాలా ఉంది.ఇలాంటి మూవీలో నాకిలాంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్, నిర్మాత విశ్వనాధ రెడ్డికి నా థాంక్స్’ అని తెలిపింది.
రిషి, పూజా రామచంద్రన్, వినోద్ కుమార్, సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి కార్తీక్ రోడ్రిగ్జ్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.