ప్రతి ఎలక్షన్ సీజన్ దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని పార్టీల వారు కొంతమంది నటీనటులను ప్రమోషన్స్ కోసం వినియోగించుకుంటారు. కొంతమంది నటీనటులు ఏదో ఒక పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ సారి ఎలక్షన్స్ లో పాల్గొనడానికి విలక్షణ నటుడు శరత్ బాబు ఉత్సాహాన్ని చూపుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం శరత్ బాబు త్వరలోనే బిజెపిలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రోజు ఉదయం విజయనగరం వెళ్ళిన ఆయన అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ‘ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. మీరు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానని’ అన్నారు. అలాగే బిజెపి నాయకులు వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి విజాగ్ నుంచి ఎంపి గా పోటీ చేయమని కోరుతున్నారని తెలిపాడు.
ఇప్పటి వరకూ సుమారు 200 సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు శరత్ బాబు ఇప్పుడు రూటు మార్చి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం బిజెపి లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాడు.