ఆడియన్స్ కి ప్రాంతీయ భేదం లేదంటున్న దిల్ రాజు

ఆడియన్స్ కి ప్రాంతీయ భేదం లేదంటున్న దిల్ రాజు

Published on Mar 6, 2014 12:14 AM IST

Dil-Raju

ఒక్కటిగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అలజడి మొదలైంది. ఇప్పటికే తెలంగాణ వారు తమ కోసం ప్రత్యేక చిత్ర రంగాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలను ఇరు ప్రాంతాల వారు ఎలా తీసుకుంటారా అనే ప్రశ్న కొందరి మదిలో ఉంది.

ఇదే ప్రశ్నని టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ముందు ఉంచితే.. ప్రేక్షకులు సినిమాని తెలంగాణ ప్రాంతం వారు తీశారా లేక సీమాంధ్ర వారు తీశారా అని చూడరు. సినిమా బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఆడియన్స్ కి ప్రాంతీయ బేధం ఉండదు. అలాగే మాట్లాడుతూ ‘సినిమా రంగంలోకి ఎక్కడి నుంచైనా వచ్చి కష్టపడి, తమ టాలెంట్ ని చూపించుకోవడానికి ఓ సరైన వేదిక. తెలంగాణ నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈ స్థానంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఎక్కడ ముగుస్తుందో తెలియదని’ అన్నాడు.

తాజా వార్తలు