చందమామ కథలుకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న టీం

చందమామ కథలుకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న టీం

Published on Mar 4, 2014 7:00 PM IST

Chandamama-Kathalu
ప్రస్తుతం మన టాలీవుడ్ లో కేవలం మాస్ ఎంటర్టైనర్స్ సినిమాలే కాకుండా విభిన్న తరహా సినిమాలు కూడా చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. అలా రొటీన్ కి భిన్నంగా 8 విభిన్న కథలతో ప్రవీణ్ సత్తారు చేసిన సినిమా ‘చందమామ కథలు’. ఇటీవలే ఆడియో విడుదలైన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ మంచు, చైతన్య కృష్ణ, నరేష్, కృష్ణుడు, ఆమని, రిచా పనాయ్, కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ‘ఇటీవలే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము సరికొత్తగా విడుదల చేసిన డిజిటల్ ఆన్ లైన్ ఫార్మాట్ ఆడియో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ ని బట్టి ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే ఈ సినిమాకి వాల్యూం 1 అని పెట్టామని’ అన్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాకి చక్రి బూనేటి నిర్మాత.

తాజా వార్తలు