కోలీవుడ్ సమాచారం ప్రకారం శ్రియ శరన్ పెద్ద ప్రాజెక్ట్ ను సంపాదించుకుంది. జాతీయ అవార్డు గ్రహీత బాల దర్శకత్వంలో రానున్న ఒక సినిమాకు నాయికగా ఎంపికయ్యినట్టు సమాచారం. గతంలో బాలా పరదేశి, వాడు వీడు, నేను దేవుడ్ని వంటి సినిమాలు తీసాడు
తమిళనాడు కు చెందినా ఒక నృత్య సంప్రదాయం ఆధారంగా ఈ సినిమా తీయనున్నారు. ఎలాగో శ్రియ కథక్ డ్యాన్సర్ గా పేరు సంపాదించుకున్న విషయం తెలిసినదే. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నారు. ఇళయరాజ సంగీతదర్శకుడు
ఈ మార్చ్ 31న విడుదలకాబోతున్న మనం సినిమాలో ఈ భామ నాగార్జున సరసన నటించింది