నాని నూతన సినిమా ‘ఆహా కళ్యాణం’ పాటల విడుదల వేడుక ఈనెల 23న జరగనుంది. గోకుల్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమా ‘బ్యాండ్ భాజా భారాత్’ కు రిమేక్. తమిళంలో తీసిన సినిమాను తెలుగులోకి అనువదించారు
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా నాని, వాణి ల మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతం అంటున్నారు. వీరిద్దరూ ఈ సినిమాలో వెడ్డింగ్ ప్లానర్స్ పాత్ర పోషించనున్నారు. సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించింది
ధరన్ కుమార్ సంగీత దర్శకుడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 7న మనముందుకు రానుంది