సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్స్ లో ప్రప్రధమంగా చెప్పుకోవాల్సిన వాళ్ళలో కె. బాలచందర్ ఒకరు. ఆయన ఎంతో మంది హీరోలను సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు అందించారు. అందులో ప్రముఖులు రజినీకాంత్, కమల్ హాసన్. ఇప్పటి వరకూ తెర వెనుక ఉండి సినిమాలు తీసిన బాల చందర్ కెమెరా ముందుకు వచ్చి నటించబోతున్నారు. అది కూడా తన శిష్యుడు కమల్ హాసన్ కోసం..
కమల్ హాసన్ త్వరలో ‘ఉత్తమ విలన్’ అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకి కథ కమల్ హాసన్ అందించాడు. ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం కమల్ హాసన్ బాల చందర్ ని ఒప్పించాడు. ఆ పాత్ర కోసం బాలా చందర్ గడ్డం కూడా పెంచుతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ సూపర్ స్టార్ గా కనిపించనున్న ఈ మూవీలో బాలచందర్ పాత్ర తన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందని సమాచారం. రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ విశ్వరూపం 2 సినిమా విడుదలయ్యాక సెట్స్ పైకి వెళ్తుంది.