కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తుంటాను – మహేష్ బాబు

కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తుంటాను – మహేష్ బాబు

Published on Jan 14, 2014 3:52 PM IST

mahesh_babu
‘నేను ఎప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి కొత్తగా ట్రై చెయ్యడానికి ప్రయత్నిస్తుంటాను. అలాగే బయట రాష్ట్రాల వాళ్ళు తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలనేది నా లక్ష్యం. అందువల్లే నేను ‘1’ లాంటి సినిమా చేసినందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను. మేము చాలా కష్టపడ్డాం, అలాగే మా కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నానని’ మహేష్ బాబు అన్నాడు. వరుసగా మూడు హిట్స్ అందుకున్న మహేష్ బాబుని ఎందుకు ఇలాంటి రిస్క్ చేసావ్ అని అడిగితే పై విధంగా స్పందించాడు.

అలాగే సినిమా గురించి చెబుతూ మొదట సినిమాకి కాస్త డివైడ్ టాక్ వచ్చిన ఆ తర్వాత సినిమాలో మేము ఏం చూపించాం అన్నది అర్థమైంది. ‘నా కెరీర్లో ఇప్పటి వరకు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ 1. మేము కథని నమ్మక పోయి ఉంటె ఇంత పెద్ద సినిమా చేసి ఉండే వాళ్ళ కాదు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి కీ పాయింట్, అది చాలా బాగా వచ్చిందని’ అన్నాడు

సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు