త్వరలో ‘ఎవడు’ మలయాళ వర్షన్ విడుదల

త్వరలో ‘ఎవడు’ మలయాళ వర్షన్ విడుదల

Published on Jan 12, 2014 9:30 AM IST

Yevadu-Release
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా మలయాళం కూడా విడుదల కావడానికి సిద్దమవుతోంది. మలయాళంలో ఈ సినిమా టైటిల్ ‘ భైయా మై బ్రదర్’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 24న విడుదలకానుంది. ఈ సినిమా మలయాళం వర్షన్ ని కె. మంజు నిర్మించారు. గతంలో కూడా రామ్ చరణ్ నటించిన నాయక్, రచ్చ, మగదీర సినిమాలు కూడా మలయాళంలోవిడుదలయ్యాయి. ఈ సినిమాలకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వుండటం వల్ల కేరళలో మంచి కలెక్షన్ లు రావడానికి అవకాశం వుంది. ఈ సినిమాలో శృతి హసన్, అమీ జాక్సన్, కాజల్ అగర్వాల్ లు నటించారు. తెలుగు వర్షన్ లో ఈ సినిమాకి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిగా దిల్ రాజు నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు