ప్రభాస్, నాగ చైతన్యల హిట్ సినిమా రిమేక్ లో అల్లు శిరీష్

ప్రభాస్, నాగ చైతన్యల హిట్ సినిమా రిమేక్ లో అల్లు శిరీష్

Published on Jan 5, 2012 5:37 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు మరియు అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా రాబోతున్నాడు అనే విషయం గతంలోనే చెప్పాము. ఆయన నటించబోయే మొదటి చిత్రం తమిళ్లో త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కోసం ఆయన పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మా విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం హిట్ సినిమాలు ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ లేదా నాగ చైతన్య నటించిన 100% లవ్ సినిమాలలో ఏదో ఒక చిత్రం చేయబోతున్నారు. దీని గురించి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని త్వరలోనే పూర్తి వివరాలు తెల్సుస్తాయని సమాచారం. శిరీష్ సరసన కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు