‘ఎవడు’ సినిమా విజయంపై దీమాగా ఉన్న దిల్ రాజు

‘ఎవడు’ సినిమా విజయంపై దీమాగా ఉన్న దిల్ రాజు

Published on Jan 2, 2014 6:29 PM IST

dil-raju
దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘ఎవడు’. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట ఈ సినిమాని విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అలాగే ఈ సినిమా విడుదలకు చాలా సమస్యలు ఎదురైయ్యాయి . ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. దిల్ రాజు ఈ సినిమా విజయం సాదిస్తుందని చాలా దీమాగా వున్నాడు. కొంతమంది నటినటులు, నిర్మాతలు, యూనిట్ సభ్యులు జనవరి 1వ తేదిన ఈ సినిమాని చూసి పాజిటివ్ గా స్పందించారు. దానితో దిల్ రాజు ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పెయిడ్ ప్రిమియర్ షో వేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామ్ చరణ్, శృతి హసన్, అమీ జాక్సన్ లు ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు