అందరిని ఆకట్టుకోలేకపోతున్న నటుల పాటలు

అందరిని ఆకట్టుకోలేకపోతున్న నటుల పాటలు

Published on Jan 4, 2012 8:17 PM IST

 

దర్శకులు మరియు నటులు మైక్రోఫోన్ పట్టుకొని గొంతు సవరించుకునే ట్రెండ్ అప్పుడెప్పుడో ఉండేది. కమల్ హాసన్,చిరంజీవి,అమీర్ ఖాన్ మరియు మోహన్ లాల్ లు కూడా ఒకప్పుడు పాడిన వారే తరువాత నటన మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు మళ్ళి “కొలవెరి డీ” పాట వల్ల మళ్ళి నటులు, దర్శకులు పాడటం మొదలు పెట్టారు.ఆ పాట భారీగా విజయవంతం అయ్యింది. “బిజినెస్ మాన్” చిత్రం కోసం మహేష్ బాబు మరియు పూరి లు పాడారు. సోను సూద్ తో కలిసి చేస్తున్న చిత్రం లో మల్లికా కూడా పాడుతున్నారు.కాని ఎప్పుడో ఒక్కసారే ఈ ఆనవాయితి విజయం సాదిస్తుంది. అలా అని నటులు పాడలేరు అని కాదు కొంతమంది నటులు గాయకులు గా కూడా నిరూపించుకున్నారు. ఈ విషయం లో సిద్దార్థ్ మరియు శ్రుతి హాసన్ లు ముందుంటారు. ఇలా పాడేవాళ్ళు ఎక్కువమంది లేరు. ఆడియో ద్వారా వచ్చే లాభాలు నిర్మాతకి చాలా తోడ్పడుతాయి దీనికోసం నిర్మాతలు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు