కన్నడ సినిమాలో మెరవనున్న బ్రహ్మానందం

కన్నడ సినిమాలో మెరవనున్న బ్రహ్మానందం

Published on Dec 5, 2013 2:58 PM IST

brahmanandam-2-30
టాలీవుడ్ కామెడీ స్టార్ బ్రహ్మానందం త్వరలో ఓ కన్నడ సినిమాలో కనిపించడానికి సిద్దమవుతున్నాడు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించనున్న నిన్నిన్దలే సినిమాలో బ్రహ్మనడం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. బ్రహ్మానందం తన 25 సంవత్సరాల కెరీర్లో ఆయన నటించిన సినిమాల నెంబర్ 1000 కి దగ్గరలో ఉంది. అందులో కొన్ని తమిళ్, హిందీ సినిమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తెలుగు సినిమాలే ఉంటాయి. ఇటీవలే బాలీవుడ్ డైరెక్టర్ అనీస్ బజ్మీ తను తీసుతున్న వెల్ కమ్ సినిమాలో బ్రహ్మానందంని స్పెషల్ రోల్ చేయమని ఆఫర్ చేసారు.

మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం బ్రహ్మానందం డిసెంబర్ 6నుంచి నిన్నిన్దలే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఎరికా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘లెజెండ్రీ కమెడియన్ బ్రహ్మానందం గారితో పని చెయ్యడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఆయన సెట్స్ లోకి ఎప్పుడు వస్తారా అని టీం అంతా ఎదురుచూస్తున్నారని’ అని ఎరికా ఫెర్నాండేజ్ తెలిపింది. జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని విజయ్ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు