అలాంటి వాళ్ళంటే నాకు నచ్చదంటున్న తాప్సీ

అలాంటి వాళ్ళంటే నాకు నచ్చదంటున్న తాప్సీ

Published on Dec 4, 2013 8:30 AM IST

Taapsee
ఢిల్లీకి చెందిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీకి ఈ సంవత్సరం ఇటు టాలీవుడ్, కోలీవుడ్ అటు బాలీవుడ్లో బాగానే కలిసి వచ్చింది. తెలుగులో ‘సాహసం’ సినిమాతో హిట్ అందుకుంటే, కోలీవుడ్ లో ‘ఆరంభం’ సినిమాతో హిట్, ఇక బాలీవుడ్ లో తను చేసిన మొదటి సినిమా చష్మే బద్దూర్ కూడా హిట్ అందుకోవడంతో తాప్సీ ఫుల్ హ్యాపీగా ఉంది.

అలాంటి తాప్సీ తనకు నచ్చనిది, తను బాగా ఇబ్బంది పడే సందర్భాన్ని గురించి చెబుతూ ‘ నేను బాగా ఇబ్బంది పడే క్షణాలు ఏదైనా ఉన్నాయి అంటే అది ఎదుటి వారిని పొగిడే క్షణాలే.. అలా అని పొగడ కూడదని కాదు. ఎవరి ప్ర్రతిభని అయినా గుర్తించాలి. ఎవరి సినిమా నచ్చినా అభినందిస్తా.. నాకు నా, పర అనే బేదాల్లేవ్ కానీ అవసరం లేకున్నా పని గట్టుకొని అతిగా పొగిడే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. నేను అలా చెయ్యలేను అది నా బలహీనత. ప్రశంశ లేదా విమర్శ ఏదైనా సరే మనసులో నుంచి రావాలని’ ఈ సొట్ట బుగ్గల చిన్నది అంటోంది. తాప్సీ ప్రస్తుతం ముని 3 మరియు హిందీలో రన్నింగ్ షాదీ.కామ్ సినిమాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు