మరో చారిత్రాత్మక నేపధ్యంలో నటించనున్న అనుష్క?

మరో చారిత్రాత్మక నేపధ్యంలో నటించనున్న అనుష్క?

Published on Dec 3, 2013 11:21 PM IST

anushka
ఫాంటసీ సినిమాలపై దుష్టిపెట్టడం ప్రస్తుతం టాలీవుడ్ ట్రెండ్ అవుతున్నట్టు వుంది. ఎస్.ఎస్ రాజమౌళి ‘బాహుబలి’ మరియు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాలు ప్రస్తుతం నిర్మాణదశలో వున్నాయి. ఈ రెండు సినిమాలలో అనుష్క ప్రధాన పాత్రధారి

ఇప్పుడు తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం అనుష్క మరో చారిత్రాత్మక నేపధ్యంలో నటించనుంది. విశేషమేమిటంటే ఇందులో కూడా కధ ఈమె చుట్టూనే నడవనుంది. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై ఈమెతో ‘భాగమతి’ సినిమాను తీయనున్నారు. ఈ సంస్థ గతంలో ‘మిర్చి’ని నిర్మించింది. ఈ సినిమా 2014 మేనెలలో మొదలుకావచ్చు

భాగమతి 16వ శతాబ్ధంలో హైదరాబాద్ సుల్తాన్ కులీ కుతుబ్ షాహ్ భార్య. త్వరలో అధికారిక ప్రకటన జరగనుంది

తాజా వార్తలు