డిసెంబర్ 20న విడుదలకానున్న బిర్యానీ

డిసెంబర్ 20న విడుదలకానున్న బిర్యానీ

Published on Dec 2, 2013 7:58 PM IST

biryani

కార్తీ, హన్సిక నటించిన బిర్యానీ సినిమా తమిళ మరియు తెలుగు భాషలలొ ఏకకాలంలో డిసెంబర్ 20న విడుదలకానుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకుడు. కె. ఈ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. గతంలో కార్తీ నటించిన ‘ఆవారా’, ‘నా పేరు శివ’ ఒక మాదిరిగా ఆడితే ‘యుగానికి ఒక్కడు’ ప్రశంసలు సాధించింది. అయితే చివరిగా విడుదలైన శకుని, బ్యాడ్ బాయ్ మెప్పించలేకపోయింది.

సమాచారం ప్రకారం కార్తీ కెరీర్ లోనే ప్లే బాయ్ గా చాలా స్టైలిష్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇద్దరు స్నేహితులు ఒక రాత్రి బయటకు వెళ్తే వారి జీవితంలో కలిగే మార్పు ఈ సినిమాలో చూపించనున్నారు. దర్శకుని గత చిత్రాల ‘గ్యాంబ్లర్’, ‘గోవా’, ‘సరోజ’ వలే ఇదికూడా కామిడీ నేపధ్యంలో సాగుతుంది.

కార్తీ మరియు హన్సిక మొదటిసారిగా జతకట్టారు. ప్రేమ్ జీ మరియు మాండి ముఖ్య పాత్రధారులు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.

తాజా వార్తలు