తన హీరోల సీక్రెట్ చెప్పిన సుకుమార్

తన హీరోల సీక్రెట్ చెప్పిన సుకుమార్

Published on Dec 1, 2013 6:38 PM IST

sukumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోని డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నించే దర్శకుల్లో సుకుమార్ కూడా ఒకరు. ఆయన తీసిన ఆర్య సినిమా నుంచి 100% లవ్ వరకు ప్రతి సినిమాలోనూ హీరో పాత్రని సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా చూపిస్తుంటాడు. ఉదాహరణకి ఆర్య 2 లో అల్లు అర్జున్ పాత్రని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. చివర్లో గానీ తను ఎందుకు అలా చేస్తున్నాడో తెలిసింది. అలాగే ఇలాంటి పాత్రలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడం కాస్త కష్టమైన పని.

మీ సినిమాల్లో హీరో ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంటారని సుకుమార్ ని అడిగితే ‘ మనలో ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి. వాటిలో కొన్నింటిని మనం మనలోనే అనచివేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. ఎప్పుడైతే మనలోని ఈర్ష, ద్వేషాలు బయట పడతాయో అప్పుడే సమస్యలు వస్తాయి. మనం ఏదన్నా సాధించడం కోసం ఏదో ఒక ఫోర్స్ కావాలి. అది జలసీ కూడా అవ్వొచ్చని’ సుకుమార్ సమాధానమిచ్చాడు.

ఈ సమాధానం తర్వాత చూసుకుంటే సుకుమార్ 100% లవ్ లో ఈర్షని చూపించాడు, ఆర్య 2 లో స్వార్ధాన్ని చూపించాడు. సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ‘1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఆ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు