చివరిగా సాహసం సినిమాలో కనిపించిన గోపీచంద్ ప్రస్తుతం బి. గోపాల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ద్విభాషా చిత్రంలో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబందించిన 40% షూటింగ్ పూర్తయ్యింది. అందులో రెండు పాటలను కూడా షూట్ చేసేసారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ డిసెంబర్ మొదట్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త షెడ్యూల్ లో గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
నయనతార శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘అనామిక’ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా గురించి బి.గోపాల్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ ఇది ధైర్య సాహసాలు కలిగిన ఓ యంగ్ మాన్ స్టొరీ. గోపీచంద్ – నయనతార చాలా బాగా చేస్తున్నారని’ అన్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని తాండ్ర రమేష్ – జయ బాలాజీ నిర్మిస్తున్నారు.