షూటింగ్ పూర్తి చేసుకున్న జెండాపై కపిరాజు

షూటింగ్ పూర్తి చేసుకున్న జెండాపై కపిరాజు

Published on Nov 29, 2013 9:40 AM IST

Jendapai-Kapi-Raju
యంగ్ హీరో నాని హీరోగా నటిస్తున్న ‘జెండాపై కపిరాజు’ సినిమా ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్ర చివరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో షూట్ చేసారు. దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై కెఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు.

ఈ యాక్షన్ డ్రామా సినిమాలో నాని – అమలా పాల్ జంటగా నటించారు. గత వారమే నాని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమాలో నాని డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి అరవింద్ శివ శంకర్, ఇతను ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాడు. రెండవది ఓ పనిమీద ఆంధ్రప్రదేశ్ కి వచ్చే తమిళియన్ అయిన మయ కన్నన్. నాని రిలీజ్ చేసిన మయ కన్నన్ పాత్ర లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో కన్నడ నటి రాగిణి ద్వివేది ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే నాని – రాగిణి ద్వివేది పై ఓ ప్రత్యెక గీతాన్ని కూడా షూట్ చేసారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలయ్యే అవకాసహం ఉంది.

తాజా వార్తలు