డిసెంబర్ లో ముగియనున్న ‘రేసు గుర్రం’ షూటింగ్

డిసెంబర్ లో ముగియనున్న ‘రేసు గుర్రం’ షూటింగ్

Published on Nov 29, 2013 9:35 AM IST

Race_Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేసు గుర్రం’ సినిమా ప్రస్తుతం అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను జడ్చర్ల పరిసర ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో హీరో, బ్రహ్మానందం, రవి కిషన్ పాల్గొంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మూడవ వారంతో ముగుసే అవకాశం ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు. శృతి హసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతాన్నిఅందిస్తున్న ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు