సూపర్ స్టార్ మహేష్ బాబుకి బంధువైన కృష్ణ మాధవ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘హృదయం ఎక్కడున్నది’. ఈ సినిమా ఆడియో నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. మహేష్ బాబు ఆడియో విడుదల చేసి మొదటి సిడిని మంత్రి గల్లా అరుణ కుమారికి అందించాడు.
ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ ‘ కృష్ణ మాధవ్ నాకు ఖలేజా సినిమా నుంచి తెలుసు. అతను పెద్దింటి నుంచి వాడు కదా తలబిరుసు ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ తనలో కష్టపడే తత్త్వం ఉంది. అదినాకు బాగా నచ్చింది. ఖలేజా, దూకుడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన తను హీరోగా మారి చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని’ అన్నాడు.
పవన్ – సంజయ్ సంయుక్తంగా నిర్మించిన ‘హృదయం ఎక్కడున్నది’ సినిమాకి ఎఆర్
మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఆనంద్ డైరెక్టర్.