ఒకే సంస్థలో కలిసి పనిచేయనున్న సమంత, కాజల్

ఒకే సంస్థలో కలిసి పనిచేయనున్న సమంత, కాజల్

Published on Nov 17, 2013 7:00 PM IST

Samantha,-Kajal
సమంత, కాజల్ అగర్వాల్ జంటగా మరో సారి కనిపించనున్నారు. కానీ ఈ సారి వారిద్దరూ కలిసి సినిమాలో కనిపించడం లేదు. వీరిద్దరూ గతంలో ఎన్ టి ఆర్ తో కలిసి బృందావనం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా వున్నారు. ఇప్పుడు వారిద్దరూ ఒకే కంపెనీ చెందినా వస్తువుల ప్రచారకర్తలుగా పని చేయడానికి సంతకం చేయడం జరిగింది. సమంత వాటిక వారి సమృద్దిమైన కొబ్బరి నూనెకి, అలాగే కాజల్ అగర్వాల్ ముఖానికి సంబందించిన ఒక కొత్త వాటిక ప్రీమియం న్యాచురల్ షాంపూకి ప్రచార కర్తలుగా వ్యవహరించనున్నారు. అయితే ఇదంతా అనుకోకుండా జరిగింది. ఇండియాలో ప్రముఖల సంస్థలలో ఒకటైన వాటిక వారు తెలుగు, తమిళల సినిమాలో నటించే ఇద్దరు పెద్ద హీరోయిన్స్ ని వారి వస్తువుల ప్రచారకర్తలుగా నియమించడం జరిగింది. కానీ అంతకు ముందే వారిద్దరూ మంచి ప్రెండ్స్ . ప్రస్తుతం సమంత లక్స్ కి ప్రచారకర్తగా, అలాగే కాజల్ అగర్వాల్ బృ మరియు కోల్గేట్ లకి ప్రచారకర్తలుగా వున్నారు.

తాజా వార్తలు