రేపు నిత్య మీనన్ ‘మాలిని 22’ ఆడియో విడుదల

రేపు నిత్య మీనన్ ‘మాలిని 22’ ఆడియో విడుదల

Published on Nov 15, 2013 6:00 PM IST

malini
నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘మాలిని 22’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ’22 ఫిమేల్ కొట్టాయం’ సినిమాకి రిమేక్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని రేపు హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. ఈ ఆడియోని ప్రసాద్ ల్యాబ్ లో 16న సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. అరవింద్ – శంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కి ప్రముఖ నటి శ్రీ ప్రియ దర్శకత్వం వహిస్తోంది. రాజ్ కుమార్ సేతుపతి నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు ,తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. కేరళ లో సూపర్ హిట్ అయిన ‘ 22 ఫిమేల్ కొట్టాయం’ సినిమాలో రీమ కల్లింగల్ ప్రధాన పాత్రలో నటించింది.

తాజా వార్తలు