డిసెంబర్ 14న 1-నేనొక్కడినే ఆడియో

డిసెంబర్ 14న 1-నేనొక్కడినే ఆడియో

Published on Nov 13, 2013 1:19 AM IST

1Nenokkadine

వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ విడుదలకానుంది

ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ సన్నివేశాలను మహేష్, గౌతమ్ ల నడుమ గోవాలో షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాలతో మనముందుకు రానుంది. మహేష్ కు తొలిసారిగా దేవి స్వరపరిచిన ఆడియోను డిసెంబర్ 14న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకొసం వినూత్న ఐడియాల వేటలో వున్నారు. కినేమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించనున్నారు

కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. రామ్ ఆచంట, గోపి ఆచంట మరియు అనీల్ సుంకర ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు

తాజా వార్తలు