‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా విడుదల గత కొంతకాలంగా జాప్యం జరుగుతుంది. హైదరాబాద్ లో జన సంచారం భారీగా వుండే ప్రదేశాలలో ఈ సినిమా పోస్టర్లు చాలా రోజులనుండి దర్శనమిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమా బృందం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ద్వారా ‘యు’ సర్టిఫికేట్ ను అందుకుంది. ‘శ్రీ రామరాజ్యం’ సినిమాను నిర్మించిన యలమంచలి సాయిబాబు తనయుడు రేవంత్ ఈ సినిమాలో హీరోగా పరిచయంకానున్నాడు. కె. రాఘవేంద్ర రావు దర్శకుడు
సనమ్ మరియు అనన్య హీరోయిన్స్. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఈ మ్యూజికల్ ఎంటెర్టైనర్ ను సాయి బాబు నిర్మించారు