మనవడు అక్కినేని నాగ చైతన్యతో రామానాయుడు సినిమా

మనవడు అక్కినేని నాగ చైతన్యతో రామానాయుడు సినిమా

Published on Nov 11, 2013 8:41 AM IST

naga-chayatana-latest-still

మూవీ మొగల్ డా. డి రామానాయుడు తన మనవడు అక్కినేని నాగ చైతన్య కోసం ఒక కొత్త సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమా పంజాబీ సినిమా ‘సింగ్ వర్సెస్ కౌర్’ కి రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటించవచ్చునని బావిస్తున్నారు. పంజాబీ వర్షన్ లో ఈ సినిమాని డా రామానాయుడు గారే నిర్మించారు. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా నిర్మించనున్నారు. గిప్పీ గ్రేవల్, సుర్వీన్ చావ్లా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. తెలుగు వర్షన్ లో కూడా ఈ సినిమాని మంచి కామెడీ, ఎంటర్టైనర్ గా నిర్మించే అవకాశం వుంది. ఈ సినిమాకి సంబందించిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లు ఎవరనే సమాచారం ఇంకా తెలియజేయలేదు.

తాజా వార్తలు