ఏమో గుర్రం ఎగరావచ్చుకి డబ్బింగ్ పూర్తి చేసిన సుమంత్

ఏమో గుర్రం ఎగరావచ్చుకి డబ్బింగ్ పూర్తి చేసిన సుమంత్

Published on Nov 10, 2013 12:40 PM IST

emo-gurram-egaravachu
బాక్స్ ఆఫీసు వద్ద సరైన హిట్స్ అందుకోలేక పోయిన హీరో సుమంత్ ప్రస్తుతం చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. సుమంత్ చివరిగా చేసిన ‘దగ్గరగా దూరంగా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’. ఫిబ్రవరిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

ఎస్ఎస్ కాంచి కథ అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆడియోని త్వరలో రిలీజ్ చేసి వెంటనే సినిమాని కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. పింకీ సావిక హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. చంద్ర సిద్దార్థ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మదన్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు