తెలుగు సినిమా రంగంలో ఇప్పటిదాకా ఎన్నడూ ఎదురుచుదని రీతిలో ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది
2015లో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇదిలావుంటే ఇటీవల ఆంధ్రాలో పడిన భారీ వర్షాలు సామాన్య ప్రజలకే కాక ‘బాహుబలి’ బృందానికి కూడా కష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణకోసం ఒక జొన్నతోటను నెలరోజులుగా పెంచుతున్నారు. ఒక వారం షూటింగ్ కూడా సాగింది. అయితే ఇప్పుడు ఈ వర్షాలకారణంగా తోట మొత్తం వర్షంతో కొట్టుకుపోయి షూటింగ్ కు పనికిరాకుండా పోయింది. ఈ వార్త విన్న రాజమౌళి వాపోయాడు
ప్రభాస్, అనుష్క మరియు రానా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు