నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొద్ది రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నేటితో హైదరాబాద్ షెడ్యూల్ ముగియనుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ నవంబర్ మొదటి వారం నుంచి వైజాగ్ లో ప్రారంభం కానుంది.
మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని అందరూ అంచనా వేస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ మూవీకి డైరెక్టర్. ‘సింహా’ లాంటి సూపర్ సక్సెస్ఫుల్ మూవీ తర్వాత బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా లెజెండ్. ఈ సినిమాలో బాలయ్యకి పోటీ ఇచ్చే విలన్ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు.
వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘లెజెండ్’ 2014 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.