టాలెంట్ తో పాటూ అందంకూడా కలిసిన హీరోయిన్లలో ఆసిన్ ఒకరు. కేరళలో కొచ్చి ప్రదేశంలో పుట్టిసెల్ ఫోన్ యాడ్ తో తెరపైకి వచ్చిన ఈ భామ నేడు 28వ పుట్టినరోజుని జరుపుకుంటుంది. ఈమె 15 సంవత్సరాల వయసులో ‘నరేంద్రన్ మాకన్ జయకాంతన్ వక’ అనే మలయాళం సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది
పూరి తీసిన ‘అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రికి పరిచయమై ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాక ఆసిన్ కు ఫిలింఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఘర్షణ, లక్ష్మి నరసింహ మరియు శివమణి సినిమాల ద్వారా విజయాల్ని అందుకుంది
2004 – 2008 మధ్య అసిన్ తమిళ కినేమాలలో వరుస విజయాలు సాధించింది. ఆమర్ ఖాన్ నటించిన ‘గజిని’ సినిమా ద్వారా 100 కోట్ల క్లబ్ లో చెరీ ఘనమైన ఎంట్రీని అందుకుంది.
ప్రస్తుతం బోల్ బచ్చన్, రెడీ, హౌస్ ఫుల్ 2 సినిమాలతో హింది విజయాలు అందుకున్న ఈ భామకు 123 ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం