పెళ్లిపై పుకార్లను ఖండించిన కాజల్

పెళ్లిపై పుకార్లను ఖండించిన కాజల్

Published on Oct 25, 2013 3:45 PM IST

Kajal
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ఇప్పుడు బాలీవుడ్ లో ఎదగడానికి ప్రయత్నిస్తున్న భామ కాజల్. ఈ అమ్మడు చెల్లి నిషా అగర్వాల్ కు ఇటీవలే నిశ్చితార్ధం అయ్యి ఈ యేడాది చివర్లో పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది

ఈ వార్త వెలువడిన దగ్గరనుండి కాజల్ పెళ్లిపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే కాజల్ వీటిని ఖండించింది. “మా చెల్లి ప్రేమలో వున్నాది. అందుకే పెళ్లి చేసుకోవడం అన్నది తన నిర్ణయంగా తీసుకుంది . నేను ప్రస్తుతం ఎవ్వరిని ప్రేమించే స్థితిలో లేను. నేను కెరీర్ పై దృష్టిపెట్టదలుచుకున్నాను. నా పెళ్ళికి ఇంకా చాలా సమయం వుంది” అని చెప్పింది.

ఆమె చాలా పద్దతిగల అమ్మాయట. షూటింగ్ అవ్వగనే ఇంటికి వచ్చేస్తుందట. కాబట్టి ఇలాంటి పుకార్లను పట్టించుకోకండి అని చెప్పింది

తాజా వార్తలు