కథలు మాత్రమే రాస్తా, డైరెక్షన్ చెయ్యను – ఎఆర్ రెహమాన్

కథలు మాత్రమే రాస్తా, డైరెక్షన్ చెయ్యను – ఎఆర్ రెహమాన్

Published on Oct 24, 2013 8:53 AM IST

ARRahman
సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎఆర్ రెహమాన్ అత్యంత ప్రసిద్ది చెందిన ఆస్కార్ అవార్డు కూడా అందుకొని ఏనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఆయన ప్రస్తుతం రచయితగా మారి ఓ హిందీ సినిమాకి కథ రాస్తున్నారు. కానీ ఈ సినిమాని అతనే డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై ఎఆర్ రెహమాన్ స్పందిస్తూ ‘ రికార్డింగ్స్, మ్యూజిక్ షోస్ అంటూ పలు దేశాలు తిరుగుతుంటాను. నేను చూసిన కొన్ని సంఘటనలను ఖాళీ దొరికినప్పుడు రాసుకుంటూ ఉంటాను. వాటిని చూసిన నా ఫ్రెండ్ గబ్రియెల్ రచనపై దృష్టి పెట్టమని కొన్ని టెక్నిక్స్ నేర్పించాడు. ఆ తర్వాతే రాయాలనే ఆలోచన కలిగింది. ప్రస్తుతం ఓ హిందీ సినిమాకి కథ రాస్తున్నాను. కానీ నేను డైరెక్షన్ చేయడం లేదు. అయితే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతోపాటు, మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తానని’ అన్నాడు. ఇప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఎఅర్ రెహమాన్ రచయితగా కూడా సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.

తాజా వార్తలు