సుధీర్ బాబు ఆడియో లాంచ్ కి మహేష్ వస్తున్నాడు రా బుజ్జీ

సుధీర్ బాబు ఆడియో లాంచ్ కి మహేష్ వస్తున్నాడు రా బుజ్జీ

Published on Oct 22, 2013 11:15 PM IST

Mahesh
‘ప్రేమకధాచిత్రమ్’ సినిమా విజయంతో సంతోషంలో వున్న సుధీర్ బాబు ప్రస్తుతం ‘ఆడుమగాడు రా బుజ్జీ’ సినిమాతో మనముందుకు రానున్నాడు. ఈ సినిమా టాకీ భాగం ముగిసింది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది

ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఈ నెల 30నా శిల్పకళావేదికలో జరగనుంది. ఈ వేడుకకు మహేష్ బాబు ముఖ్యఅతిధిగా హాజరుకానున్నాడు. కామెడీ సమపాళ్లలో కలిపిన యాక్షన్ ఎంటెర్టైనర్ గా ఈ సినిమా రూపుదిద్ధుకుంది. నవంబర్ లో ఈ సినిమా మనముందుకు రానుంది

అస్మిత సూద్ మరియు పూనమ్ కౌర్ హీరోయిన్స్. సాయి కొమ్మినేని సంగీతాన్ని అందించాడు. కృష్ణ రెడ్డి గంగదాసు ఈ సినిమాకు దర్శకుడు. ఎస్.ఎన్ రెడ్డి మరియు సుబ్బారెడ్డి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు

తాజా వార్తలు