కిమ్స్ హాస్పటల్ లో 19నా రాత్రి ప్రేగులకు సంబంధించిన ఆపరేషన్ నాగేశ్వరరావుగారికి చేశారు. ఈ ఆపరేషన్ అంతా సజావుగా సాగింది. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యంగానే వున్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అని తెలిపారు
ఈరోజు ఆయన మంచం పై నుండి లేచి 100 మీటర్లు నడిచారు. కాస్త బలాన్నిచ్చే ఫ్లూయిడ్స్ ఆయనకు అందించారు. రేపు ఎల్లుండలో ఆయనను జనరల్ వార్డ్ లోకి మారుస్తారు
ఆయన కుటుంబ సభ్యులు ఆయనతోనే వుంటున్నారు. ఆయాన శ్రేయోభిలాషులు తనని కలిసి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు