బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ షూటింగ్ లో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన కంటెంట్ సేఫ్ గా ఉండేలా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇటీవలే ఈ చిత్ర టీం వారు రోజు తీసే కంటెంట్ ని బద్రపరచడం కోసం ఓ కొత్త డేటా స్టోరేజ్ డివైజ్ ని తెప్పించారు. చాలా మంది ఈ డివైజ్ వల్ల పైరసీని అరికట్టవచ్చని చెప్తున్నారు. ఈ వార్తలపై రాజమౌళి క్లారిఫై ఇచ్చారు. ‘ మేము ఉపయోగిస్తున్న డివైజ్ కేవలం డేటాని స్టోరేజ్ చెయ్యడం కోసమే తప్ప మరి మరి ఏ ఇతర కారణాల కోసం కాదు. మేము రోజు తీసే ఫుటేజ్ ని డిస్క్, మరియు టేప్ ల రూపంలో భద్రపరుచుకోవడానికి మాత్రమే దీనిని ఉపయోగిస్తాం. మాములుగా షూటింగ్ చేస్తున్న సమయంలో హార్డ్ డిస్క్ లు మిస్ అయి పోతుంటాయి. అలా జరక్కుండా డేటా సేఫ్ గా ఉండటం కోసం దీనిని ఉపయోగిస్తున్నామని’ రాజమౌళి ట్వీట్ చేసారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి ప్రభాస్ కి తమ్ముడిగా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రెండు పార్ట్స్ గా రానున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.