నిర్మాతలుగా మారనున్న స్టార్ హీరో మరియు టాప్ డైరెక్టర్

నిర్మాతలుగా మారనున్న స్టార్ హీరో మరియు టాప్ డైరెక్టర్

Published on Sep 12, 2013 11:32 PM IST

pawan-kalyan-trivikram

తెలుగులో ఒక సినిమా తియ్యాలనుకుంటున్నరా?? అయితే మీకొక శుభవార్త. చాలా మంది ప్రముఖులు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే పనిలో వున్నారు. పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసినదే. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేపట్టనున్నారు.

వీళ్ళిద్దరు కలిసి ఇంకో సినిమా చేస్తున్నారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. వీరు ఒక నిర్మాణసంస్థను ప్రారంభించనున్నారు. కొత్త టాలెంట్ ను సినీరంగానికి పరిచయం చేసే క్రమంలో పవన్ మరియు త్రివిక్రమ్ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంస్థ ద్వారా చిన్న మరియు మధ్య స్థాయి బడ్జెట్ సినిమాలని తియ్యనున్నారు.

ఈ నిర్ణయం నిజంగా టాలీవుడ్ కు శుభపరిణామం అనే చెప్పాలి. పవన్, త్రివిక్రమ్ లకు జోహార్లు

తాజా వార్తలు