బికినీ పుకార్లను కొట్టి పారేసిన సమంత

బికినీ పుకార్లను కొట్టి పారేసిన సమంత

Published on Sep 12, 2013 3:20 PM IST

Samantha-in-saree
గత కొన్ని రోజులుగా అందాల భామ సమంత రాబోయే సినిమాలో బికినీలో కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు అలాగే అవి వాటి పుకార్లని సమంత కొట్టి పారేసింది. ‘ నా గత సినిమాలు చూస్తె మీరు నేను బికినీ వేసుకునే వార్తలు పుకార్లని తెలుస్తుంది. నేను రాబోయే సినిమాలో బికినీ వేసుకోబోతున్నాను అనేది పుకార్లు మాత్రమే.. ఇక ఆ వార్తల్ని ఆపేయమని’ సమంత ట్వీట్ చేసింది.

ఎన్.టి.ఆర్ తో చేస్తున్న రామయ్యా వస్తావయ్యా సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం కందిరీగ శ్రీనివాస్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా మరియు అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ ‘మనం’ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కలయన్ సరసన చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.

తాజా వార్తలు