టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో మరిచిపోలేనటువంటి చేదు అనుభవాలతో కెరీర్ ను మొదలుపెట్టిన శృతి అతితక్కువ సమయంలో వరుస విజయాలతో రెండు భాషలలొ బిజీ తారగా నిలిచింది. ఆమె ఎదుర్కున్న ఒడిదుడుకులను బట్టి ఆమె తెలుసుకుంది ఏమిటంటే “నా సినిమా హిట్ అయినప్పుడు నన్నూ, నా నటనను మెచ్చుకున్నవారే సినిమా పోయినప్పుడు నన్నూ విమర్శించేవారినీ చూశాను. నిజానికి నేను అలాంటివి పట్టించుకొను. కష్టం, కృషి మాత్రమే విజాయానికి మనల్ని చేరువ చేస్తాయని భావిస్తాను” అని తెలిపింది
దీనికి మరింత స్పందిస్తూ “విమర్శలను నేను ఆనందంగా స్వీకరిస్తాను. దీనివల్ల నన్నూ నేను ప్రశ్నించుకుని దానిద్వారా అభివృద్ది చెందుతుంటాను. అలాగే నాపై వచ్చే పొగడ్తలను
స్వ్వేకరించను. దీని ద్వారా నాకు గర్వం పెరిగే అవకాశాలు వున్నాయి. అది నాకు మంచివి కావని”తెలిపింది.