ఎన్.టి.ఆర్ దృక్పధం అసామాన్యం : ఏ.వి.ఎస్

ఎన్.టి.ఆర్ దృక్పధం అసామాన్యం : ఏ.వి.ఎస్

Published on Sep 8, 2013 4:23 PM IST

sr-ntr

తెలుగు తెరకు దొరికిన అద్బుతమైన హాస్యనటులలో ఏ.వీ.ఎస్ ఒకరు. సరిగ్గా 21యేళ్ళ క్రితం ఈరోజే ఆయన వెండితెరపై తొలిసారిగా కనిపించారు. ఈ సంధర్భంలో ఆయనకు ఎధురైన ఒక చిన్న సంఘటనను గుర్తుచేసుకున్నారు. “నేను ‘శ్రీనాధకవిసార్వభొముడు’ సినిమా షూటింగ్ సెట్లో వుండగా బాపు, రమణలు షాట్ సిద్ధంచేశారు. ఆ సన్నివేశంలో ఎన్.టి.ఆర్ ను చైన్లతో భందించి కొరడాతో కొట్టాలి. షాట్ ఓకే అయ్యింది. అయినా రామారావుగారు తృప్తి చెందక ఒక 45 నిముషాల పాటూ ఎండలో చొక్కా లేకుండా కూర్చున్నారు. మేమందరం కంగారుగా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాం.ఆతరువాత మళ్ళీ ఆదే షాట్ చేసి ఓకే చేయించారు. అదేంటి అని అడగగా, బంధీకి కావల్సిన అలిసిన శరీరం ఇందాక తీసిన షాట్ లో లేదు. అధి మేక్ అప్ గా కనిపిస్తుంది. అందుకే ఎండలో కూర్చున్నా ” అని తెలిపారు 70యేళ్ళ వయసులో ఆయన దృక్పధం, తపన తెలుస్తుంటే ఆయనను ఎందుకు ఇంతలా ఆరాధిస్తారో తేలికగా అర్ధమవుతుంది

తాజా వార్తలు