చివరి దశలో ఉన్న తూఫాన్ పోస్ట్ ప్రొడక్షన్

చివరి దశలో ఉన్న తూఫాన్ పోస్ట్ ప్రొడక్షన్

Published on Aug 20, 2013 1:30 PM IST

Ram-Charan-Thoofan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘తుఫాన్’ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకి చేరుకుంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కొన్ని మార్పులు చేసారు. తెలులో చేసిన మార్పులను డైరెక్టర్ యోగి పర్యవేక్షించాడు. ఆగష్టు 27న ‘తుఫాన్’ మూవీ ఆడియోని అధికారికంగా విడుదల చేయనున్నారు.

రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. హిందీ వెర్షన్ లో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషించాడు, అదే పాత్రని తెలుగులో శ్రీ హరి పోషించాడు. ‘జంజీర్’ సినిమా బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాని రామ్ చరణ్ బాలీవుడ్ లో తన కెరీర్ ని ప్రారంభించడానికి మొదటి సినిమాగా ఈ రీమేక్ ని ఎంచుకున్నారు.

తాజా వార్తలు