ఆ అవసరం ఎప్పుడు రాలేదంటున్న శృతి హాసన్

ఆ అవసరం ఎప్పుడు రాలేదంటున్న శృతి హాసన్

Published on Aug 20, 2013 8:40 AM IST

shruti-hassan
అందాల భామ శృతి హాసన్ తన పట్ల ఎంతో నమ్మకం ఉన్న అమ్మాయి. తను అనుకున్నది సాధించడం కోసం ఏమి కావాలో ఏమి చెయ్యాలో తెలిసిన అమ్మాయి. శృతి హాసన్ ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’, ‘ ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాల్లో నటిస్తోంది.

ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఈ రోజు శృతి హాసన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిపింది. ‘ నాకెప్పుడూ డబ్బు కోసం లేదా పేరు కోసమో ఆలోచించే అవసరం ఎప్పుడూ రాలేదు. ప్రతి సినిమాలోనూ నాలోని నటిని మరో మెట్టు పైకి ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటాను. మనం చేసే పనిని ఎంతో శ్రద్దగా చేస్తే అదే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుందని’ శృతి హాసన్ అంటోంది.

మీరు ఎవరినన్నా స్పూర్తిగా తీసుకొని చేస్తారా అని అడిగితే ‘ ఎప్పుడైతే మనం ఇంకొకర్ని స్పూర్తిగా తీసుకొని వారిలాగా నటించడం మొదలు పెడతామో అప్పుడు మనలోని సహజత్వం కనిపించదు. కావున అలా నేనెప్పుడు చెయ్యను. అందుకేనేమో నానా నటన చాలా సహజంగా ఉంటుందని’ శృతి సమాధానం ఇచ్చింది.

శృతి ప్రదర్శించిన వైఖరి బాగుంది.. మీరేమంటారు ఫ్రెండ్స్?..

తాజా వార్తలు