చిరంజీవి నన్ను చూస్తే ముఖం అదోలా పెట్టుకుంటారు – రోజా

చిరంజీవి నన్ను చూస్తే ముఖం అదోలా పెట్టుకుంటారు – రోజా

Published on Aug 18, 2013 12:46 PM IST

Roja

ఒకప్పుడు సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన విలక్షణ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె ఎలాంటి మొహమాటం, దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. రోజా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ మరియు పొలిటికల్ కెరీర్ కి సంబందించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు.

‘నేనెప్పుడు నటిని అవ్వాలని అనుకోలేదు. మా నాన్న గారు సారధి స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేసేవారు. ప్రేమ తపస్సు సినిమా డైరెక్టర్ శివప్రసాద్ మా కాలేజ్ ఆల్బంలో నా ఫోటో చూసి నటించమని అడిగారు. మా నాన్నగారు ఆయనకీ ఫ్రెండ్ కావడంతో మొదట ఆయన్ని అడిగి ఆ తర్వాత నన్ను ఒప్పించారు. ఆ సినిమా చేసేటప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవి నేను ఇప్పుడు చెప్పలేను కానీ వాటివల్లే నన్ను నేను నటిగా నిరూపించుకోగలిగానని’ రోజా చెప్పింది.

చిరంజీవి గారిపై పొలిటికల్ గా ఆమె వరుసగా చేసిన అటాక్స్ గురించి అడిగితే ‘ చిరంజీవి సున్నితమైన మనస్తత్వం కలిగినవారు. నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ లా ఉండేదాన్ని. చిరు భార్య శ్రీమతి సురేఖ గారు శ్రీదేవి, రాధ తర్వాత మీతో పాటు దీటుగా స్టెప్పులు వేయగల నటి రోజానే అని కితాబు కూడా ఇచ్చారు. కానీ పాలిటిక్స్ లోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరం వేరు వేరు పార్టీలకి చెందినవాళ్ళం కావడంతో ఆ పార్టీలోని వారిని విమర్శిస్తాం. ఆ విషయంలో ఆయన షాక్ అయ్యి ఉంటారు. ప్రస్తుతం ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్స్ లో ఎదురుపడితే ముఖం అదోలా పెట్టుకొని, మాట్లాడకుండా సీరియస్ గా వెళ్లిపోతారు. నేను కూడా మాట్లాడనని’ రోజా సమాధానమిచ్చింది.

తాజా వార్తలు