‘భాయ్’ సినిమా టీజర్ కు వచ్చిన స్పందనతో ‘కింగ్’ అక్కినేని నాజార్జున చాలా ఆనందంగావున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించింది. అభిమానులైతే ఈ మధ్య కాలంలో వచ్చిన నాగార్జున సినిమాల టీజర్లలో ఇది అద్బుతం అని అంటున్నారు
ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ మొదటి వారంలో మరియు సినిమా సెప్టెంబర్ మధ్యలో విడుదలకానుంది
ఇప్పటికే వీరభద్రం చౌదరి ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ వంటి రెండు కమర్షియల్ హిట్లను అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు