మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా మలయాళంలోకి అనువాదంకానుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. చరణ్ కజిన్ అయిన అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి పేరు ఉందిగనుక దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు ద్వారా ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ అక్టోబర్ 10 న విడుదలకు సిద్ధంగావుంది
దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకోసం దాదాపు ఏడాది పాటూ కష్టపడ్డాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్స్.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కేరళలో విజయం సాధిస్తుందో లేదో చూద్దాం