నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను – కాజల్

నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను – కాజల్

Published on Aug 14, 2013 6:48 PM IST

Kajal-Agarwal
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. ఆమె ప్రస్తుతం అధికారికంగా ఏ కొత్త తెలుగు సినిమాలో నటించడం లేదు. ప్రస్తుతం తను బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కొన్ని రోజుల నుండి ఆమె పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటిపై ఆమె ఈరోజు ఒక వీడియోని విడుదల చేసింది. ‘నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోవలనుకున్నపుడు లేదా నాకు కరెక్ట్ పర్సన్ కనిపించినప్పుడు మొదట అందరికి తెలియజేస్తాను’ అని అంది. అలాగే ఆమె పేస్ బుక్ పేజిలో ఫాన్స్ అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా సమాదానం ఇచ్చారు. నాకు నా ఫ్యామిలీ, స్నేహితులతో వున్న అనుబందం ఆత్మీయతే నా బలం. ఒక అభిమాని ఆమెని ఈ విదంగా ప్రశ్నించాడు. హీరోయిన్స్ ఏదో ఒక స్టేజ్ లో కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొంటారు కదా అని ప్రశ్నించినప్పుడు కాజల్ ఫిలాసఫీ చెప్పింది. ‘సమస్యలు ప్రతి ఇండస్ట్రీలో వస్తూవుంటాయి. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు. కానీ మనం శారీరకంగా, మానసికంగా దైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాలి. కానీ ఇప్పటివరకు నాకు అలాంటి సమస్య రాలేదు’ అని అంది.

కాజల్ మాట్లాడిన వీడియోని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి — వీడియో

తాజా వార్తలు